మాస్కులను ధరించడం, భౌతిక దూరం నియమాన్ని పాటించడం వల్ల.. దేశంలో డిసెంబర్ 1 నాటికి 2లక్షల ప్రాణాలను కాపాడవచ్చని ఓ అధ్యయనం అంచనా వేసింది. కరోనా వైరస్ వల్ల దేశంలోని ప్రజా ఆరోగ్య వ్యవస్థకు తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.
అమెరికా వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యువేషన్(ఐహెచ్‌ఎమ్‌ఈ) ఈ అధ్యయనం చేసింది. కరోనా మరణాలను మరింత నియంత్రించే అవకాశం భారత్‌కు ఉందని అభిప్రాయపడింది.
"భారత్‌ను కరోనా వైరస్ ముప్పు ఇప్పట్లో వీడదు. ఇంకా అనేక మందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. ప్రభుత్వం, ప్రజలు తీసుకునే జాగ్రత్తలపైనే దేశంలో కరోనా ప్రభావం ఆధారపడి ఉంటుంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో కీలకం."
--- క్రిస్టఫర్ ముర్రే, ఐహెచ్‌ఎమ్‌ఈ డైరక్టర్.