తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరోటా మాస్క్..​ ధరించడానికి కాదు తినడానికి! - Corona shape of parotta masks

మహమ్మారి కరోనా ఉద్భవించిన నాటి నుంచి విభిన్నమైన మాస్క్​లు మార్కెట్​లోకి వచ్చాయి. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్నో పాటలు వచ్చాయి. అయినప్పటికీ ప్రజల మాస్క్​ను బేఖాతరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు మధురైకు చెందిన ఓ హోటల్​ వినూత్నంగా మాస్క్ ఆకారంలో పరోటాను తయారు చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది.

Mask Shaped Parotta in the time of corona in temple City
పరోటా మాస్క్​ ధరించడానికి కాదు తినడానికి

By

Published : Jul 9, 2020, 2:49 PM IST

కరోనా వైరస్ ప్రపంచాన్నే మార్చేసింది. మాస్క్​ లేకుండా ఇంటి గడప దాటాలన్నా భయమేస్తుంది. అయితే కొంతమంది మాత్రం ఎలాంటి భయం లేకుండా.. మాస్క్​ ధరించకుండా యథేచ్చగా తిరుగుతున్నారు. ఈ క్రమంలో కరోనాపై అవగాహన కల్పించడం కోసం ఎన్నో పాటలు, వివిధ రకాల మాస్క్​లు వచ్చాయి.

పరోటా మాస్క్​ ధరించడానికి కాదు తినడానికి
తినడానికి సిద్ధంగా ఉన్న పరోటా మాస్క్​
పరోటా మాస్క్​ ధరించడానికి కాదు తినడానికి
మాస్క్ ఆకారంలో తయారు చేసిన పరోటా
కాల్చిన పరోటా మాస్క్​లు

తాజాగా తమిళనాడు మధురైలో వంటకాలను మాస్క్ ఆకారంలో చేసి వినూత్నంగా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది ఓ హోటల్​ యాజమాన్యం. మాస్క్​ ఆకారంలో పరోటా, కరోనా వైరస్​ ఆకృతిలో దోశను తయారు చేసి వినియోగదారులకు వడ్డిస్తున్నారు. అంతేకాకుండా ఇవి తిన్నవారికి ఉచితంగా పానీయాలు కూడా ఇస్తున్నారు.

పరోటా మాస్క్​ను చూపిస్తున్న కుక్​
కరోనా వైరస్​ ఆకృతిలో దోశలు

ఇదీ చూడండి:'ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణలో కీలకంగా భారత్'

ABOUT THE AUTHOR

...view details