వ్యర్థంలో నుంచి అద్భుతం-ఒడిశా విద్యార్థుల సృజన కళాశాల అంటేనే కళలకు వేదిక అని అర్థం. కానీ ప్రస్తుత కాలంలో కేవలం మార్కుల క్షేత్రాలుగానే మనగలుగుతున్నాయి. దీనికి భిన్నంగా ఒడిశాలోని బ్రహ్మపుర ఐటీఐ కళాశాల విద్యార్థులు చేసే కళాఖండాలు అబ్బురపరుస్తున్నాయి. తమ దగ్గర ఉన్న కళతో... వ్యర్థంలో నుంచి అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నారు. ఇప్పటికే భారీ ఆకారంలో ఉన్న మనిషి, తాబేలు ఆకృతులను రూపొందించారు.
ఫొని తుపాను తాకిడికి అతలాకుతలమైంది ఒడిశా రాష్ట్రం. ఆ ప్రకృతి విపత్తు చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు... తుపాను తాకిడికి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎన్నో వస్తువులు కొట్టుకుపోయాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వ్యర్థాలు. ఐటీఐ కళాశాల బ్రహ్మపుర విద్యార్థుల చేతులుఈ వ్యర్థాలతోనేఅద్భుతాన్ని చేశాయి. ప్రధానోపాధ్యాయులు రజత్ కుమార్ పాణిగ్రాహి ప్రోత్సాహంతో చెత్త నుంచి తైలంబు తీయవచ్చునని నిరూపించారు.
మొదలైందిలా...
వారు తయారుచేసే ఆకృతులతో వ్యర్థాల పార్క్, ప్రదర్శనశాల ప్రారంభించాలని అనుకున్నారు. ఆకృతుల నిర్మాణంపై పరిశోధనలు చేశారు. కళాశాలలో పెయింటర్లు, వెల్డింగ్, ఎలక్ట్రిషియన్, ఫిట్టింగ్, ప్లంబింగ్ల్లో శిక్షణ పొందుతున్న 120 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఈ విధానంతో 70 ఆకృతులు రూపొందించారు.
వీటిలో ఒకటి నుంచి ఐదడుగుల ఎత్తున్నవి మ్యూజియంలో, 15 నుంచి 20 అడుగుల ఎత్తు ఉన్నవి పార్క్‌లో ఉంచారు. కళాశాల ఆవరణని శుభ్రం చేసుకుని పర్యావరణ హిత ఆకృతులకు రూపమిచ్చారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద పార్క్, మ్యూజియంను ప్రధాని మోదీకి అంకితం ఇవ్వనున్నట్లు తెలిపారు విద్యార్థులు.
70 అడుగుల గిటార్...
ఛత్తీస్‌గఢ్‌లో జనరల్ స్టోర్స్ ఈస్ట్ రైల్వే ఉద్యోగులు 32 అడుగుల ఎత్తైన భారత్‌లో తయారీ ప్రతిమను రూపొందించారు. దీనిని గమనించిన ఒడిశా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు శుభ్రతో బాగ్చీ విద్యార్థులకు 70 అడుగుల గిటారు చేయమని సూచించారు. విద్యార్థులతో సమావేశమై తగిన సూచనలిచ్చి వారిని గిటారు తయారు చేసేందుకు ప్రోత్సహించారు. ప్రస్తుతం ఆ గిటారు నిర్మాణ దశలో ఉంది.