పెళ్లి. ఎవరి జీవితంలోనైనా ఓ మధురానుభూతి. కానీ ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో కొందరు వధూవరులకు వివాహం ఓ పీడ కలగానే మిగిలిపోతోంది. తాజాగా ఓ ఉత్తరప్రదేశ్ వాసి.. తన పెళ్లి కోసం 850 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేశాడు. శుభం కార్డు పడుతుందనుకునే సరికి.. పెళ్లి మండపం బదులు క్వారంటైన్ కేంద్రంలో పడ్డాడు.
సైకిల్‌పైనే..
సోనూ కుమార్ చౌహాన్ స్వగ్రామం ఉత్తరప్రదేశ్‌లోని పిప్రా రసూల్‌పుర్. కానీ అతడు పంజాబ్‌లోని లుథియానాలో ఓ టైల్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. 24ఏళ్ల సోనూకు ఈ నెల 15న వివాహం జరగాల్సి ఉంది.
లాక్డౌన్ వల్ల లుథియనాలో చిక్కుకుపోయాడు సోనూ. వేరే మార్గం లేక.. పెళ్లికి వారం రోజుల ముందు సైకిల్ మీద స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ 850 కిలోమీటర్ల యాత్రలో సోనూకు మరో నలుగురు మిత్రులు కూడా తోడయ్యారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాళ్లందరూ సైకిల్ తొక్కుతూ ఎలాగైనా సమయానికి ఊరు చేరుకోవాలనుకున్నారు.