సాధారణంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈసారి మాత్రం గతంలో కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడమే కాకుండా.. మార్చి నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపనున్నట్లు అంచనా వేసింది వాతావరణ శాఖ.
ఈ ఏడాది వాయువ్య, పశ్చిమ, మధ్య, దక్షిణ భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మార్చి నుంచే సూర్యుడు భగ్గుమననున్నాడని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్‌లోనూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.