తెలంగాణ

telangana

By

Published : Mar 12, 2019, 7:50 PM IST

ETV Bharat / bharat

ఒడిశాలో మావోల ఘాతుకం

ఒడిశాలో దారుణం జరిగింది. రహదారి నిర్మాణ పర్యవేక్షణాధికారిని మావోయిస్టులు చంపేశారు. మావోల కోసం గాలింపు ముమ్మరం చేశారు మల్కాన్​గిరి పోలీసులు.

మావోల ఘాతుకం

ఒడిశాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. మల్కాన్​గిరి జిల్లాలో ఓ రహదారి నిర్మాణ పర్యవేక్షణాధికారిని హతమార్చారు. మథిలి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కుకుర్ కండి గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాలను వెల్లడించారు మల్కాన్​గిరి ఎస్పీ జగ్మోహన్​ మీనా.

రహదారి పనులను పర్యవేక్షిస్తున్న ప్రభాత్ బిషోయి అనే సూపర్​వైజర్​ను 25 మంది మావోయిస్టులు బంధించి చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత హతమార్చారు. ఆ సమయంలో అక్కడే పని చేస్తున్న సహోద్యోగులు, కూలీలు భయంతో పరుగులు తీశారు. రోడ్డు నిర్మాణం జరుగుతున్న స్థలంలో ఉన్న వాహనాలను మావోయిస్టులు ధ్వంసం చేశారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడికి సమీపంలో బిషోయి మృతదేహాన్ని గుర్తించారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించక ముందే మవోయిస్టులు హెచ్చరికలు చేసినట్లు సమాచారం.

మావోయిస్టులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ఈ దాడిలో ఛత్తీస్​గఢ్​కి చెందిన రెడ్​ రెబల్స్​ హస్తం కూడా ఉందని అనుమానిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details