ఒడిశా రాయ్‌గఢ్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. నియామ్‌గిరి ప్రాంతంలో రహదారి నిర్మాణం కోసం తీసుకువచ్చిన రెండు జేసీబీ యంత్రాలు, ఒక రోలర్, కాంక్రీట్ మిక్సర్‌ను తగలబెట్టారు. నక్సల్స్ దుశ్చర్యలను అడ్డుకోవడానికి కార్మికులు ప్రయత్నించగా... వారిని చితకబాదారు.
రహదారి నిర్మాణ యంత్రాలను తగలబెట్టిన నక్సల్స్ - Maos breking
ఒడిశాలో అధికార యంత్రాంగాన్ని లక్ష్యంగా చేసుకొని నక్సలైట్లు దుశ్చర్యలకు పాల్పడ్డారు. రహదారి నిర్మాణ యంత్రాలను తగలబెట్టారు. అడ్డుకున్న కార్మికులను చితకబాదారు. రహదారి నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పోస్టర్లు అంటించారు.
'ఒడిశాలో రహదారి నిర్మాణ యంత్రాంగాన్ని తగలబెట్టిన మావోలు'
రహదారి నిర్మాణాన్ని ఆపాలని అధికారులను బెదిరిస్తూ మావోయిస్టులు పోస్టర్లు అంటించారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు... ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.
Last Updated : Feb 18, 2020, 2:16 AM IST