ఝార్ఖండ్ పశ్చిమ సింగ్భమ్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఆ రాష్ట్ర అటవీ శాఖకు చెందిన 12 భవనాలను పేల్చి వేశారు.
శనివారం రాత్రి కొంత మంది మావోయిస్టులు బెర్కేలా అటవీ ప్రాంతంలో ఉన్న భవనాలను చుట్టుముట్టి పోలీసులను అక్కడ నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. అక్కడ ఉన్న కొంత మంది అధికారులపై దాడి చేశారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.