పన్ను విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్కరణల కోసం దేశం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నట్టు.. వీటివల్ల పన్ను చట్టాలను కఠినంగా పాటించే అవకాశముంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"పారదర్శకతను పెంపొందించడానికి, నిజాయతీ పన్ను చెల్లింపుదారులకు బహుమతిల్చే విధంగా మోదీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావడం హర్షణీయం. వీటిని కఠినంగా అమలు చేస్తే ప్రజలు పన్ను చట్టాలను ఎక్కువగా పాటించే అవకాశముంటుంది."
-- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
ప్రత్యక్ష పన్ను విధానాన్ని ఇంకా సులభతరం చేసి, నిజాయతీగా పన్ను చెల్లిస్తున్న వారికి బహుమతులు ఇవ్వాలనే లక్ష్యంతో 'పారదర్శక పన్ను విధానం'వేదికను ప్రధాని మోదీ గురువారం ఆవిష్కరించారు.