బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో మూడింట రెండొంతుల మంది నేరచరితులు ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) ప్రకటించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన 241 మంది అఫిడవిట్లను పరిశీలించి ఈ విషయం వెల్లడించింది.
ఆ సంఖ్య పెరిగింది!
241 మందిలో 163 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. గెలిచిన అభ్యర్థుల్లో వీరి వాటా 68 శాతం. వీరిలో 123 మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. 9 మందిపై హత్యకు సంబంధించిన కేసులు, 31 మందిపై హత్యాయత్నం కేసులు, 8 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని పేర్కొంది.
2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి నేరచరితులసంఖ్య పెరిగినట్లు ఏడీఆర్ తెలిపింది. అప్పట్లో 142 మంది ఎమ్మెల్యేలపై మాత్రమే క్రిమినల్ కేసులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 163కి పెరిగింది.
అర్జేడీలో అధికంగా..