జమ్ముకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హా నియమితులయ్యారు. గిరీశ్ చంద్ర ముర్ము రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ముర్ము తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది పూర్తైన సమయంలో ముర్ము రాజీనామా చేయడం గమనార్హం.
కొత్త కాగ్!
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా ముర్ము బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలోనే గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు ఉన్నతస్థాయి అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాజీవ్ మెహర్షి ఈ వారంలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ముర్మును నియమించినట్లు తెలుస్తోంది.