తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సుప్రీం' కమిటీ నుంచి తప్పుకున్న భూపేంద్ర - భూపేంద్ర సింగ్​ మాన్​

రైతు సమస్యల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నుంచి భారతీయ కిసాన్​ యూనియన్​ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్​ మాన్​ తప్పుకున్నారు. రైతుల ప్రయోజనాల కోసమే తప్పుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Mann recuses himself from SC committee on farm laws
'సుప్రీం' కమిటీ నుంచి తప్పుకున్న భూపేంద్ర సింగ్​ మాన్​

By

Published : Jan 14, 2021, 3:02 PM IST

Updated : Jan 14, 2021, 3:17 PM IST

సాగు చట్టాల విషయంలో సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నుంచి భూపేంద్ర సింగ్​ మాన్​ తప్పుకున్నారు. తానే స్వయంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భారతీయ కిసాన్​ యూనియన్​ అధ్యక్షుడైన మాన్​.. తనను కమిటీలో ఒకరిగా నియమించినందుకు సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.

భూపేంద్ర సింగ్​ మాన్​

రైతుల ప్రయోజనాల కోసం రాజీ పడనని స్పష్టం చేసిన భూపేంద్ర.. ఈ విషయంలో తనకు ఇచ్చిన ఏ పదవినైనా త్యాగం చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. రైతులు, పంజాబ్​ వెంటే ఉంటానని తెలిపారు.

సాగు చట్టాల అమలుపై రైతులు, ప్రభుత్వంతో చర్చల కోసం జనవరి 12న ఈ కమిటీ నియమించింది అత్యున్నత న్యాయస్థానం. అయితే.. ఈ కమిటీపై రైతు సంఘాలు, విపక్షాలు పెదవి విరిచాయి. సభ్యులంతా గతంలో వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా మాట్లాడినవారేనని తెలిపాయి.

ఇదీ చూడండి:సాగు చట్టాలపై సుప్రీం స్టే- వివాద పరిష్కారానికి కమిటీ

Last Updated : Jan 14, 2021, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details