తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్లాస్టిక్​ రహిత భారతమే గాంధీకి నిజమైన నివాళి' - ప్రధాని

మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళిగా భారత్​ను ప్లాస్టిక్​ రహితంగా చేసేందుకు సంకల్పించుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని. మనసులో మాట కార్యక్రమం ద్వారా మరికొన్ని కీలకాంశాలపై ప్రసంగించారు మోదీ.

'ప్లాస్టిక్​ రహిత భారతమే గాంధీకి నిజమైన నివాళి'

By

Published : Aug 25, 2019, 12:57 PM IST

Updated : Sep 28, 2019, 5:09 AM IST

'ప్లాస్టిక్​ రహిత భారతమే గాంధీకి నిజమైన నివాళి'

ప్లాస్టిక్​ వాడకానికి వ్యతిరేకంగా ప్రజాఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు ప్రధాని నరేంద్రమోదీ. ప్లాస్టిక్ రహిత భారతావని నిర్మాణమే... మహాత్మా గాంధీకి అసలైన నివాళి అవుతుందని అన్నారు.

మనసులో మాట కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ.

" భారత్​ మెగా పండుగకు సిద్ధమవుతోంది. అక్టోబర్​ 2న మహాత్మా గాంధీ 150వ జయంతి గురించే ప్రపంచం మాట్లాడుకుంటోంది. సేవా స్ఫూర్తి మహాత్ముడి జీవితంలోని విడదీయరాని భాగం. మహాత్మాగాంధీ 150 జయంత్యుత్సవాలు జరుపుకునేటప్పుడు ఆయనకు బహిరంగ మలవిసర్జన రహిత భారత్​ను అంకితమివ్వడమే కాకుండా దేశాన్ని ప్లాస్టిక్​ రహితంగా మార్చడానికి ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభిద్దాం. భారత్​ను ప్లాస్టిక్ రహితంగా మార్చడం ద్వారా ఈ ఏడాది గాంధీ జయంతిని జరుపుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

మహాత్ముని 150 జయంతి ఉత్సవాల్లో భాగంగా వచ్చే సెప్టెంబర్​ 11 నుంచి ఊరూరా, వాడవాడలా పారిశుద్ధ్య కార్యక్రమం మొదలవుతుందన్నారు ప్రధాని.

ఇదీ చూడండి: జీ-7: మోదీ-ట్రంప్​ భేటీలో ప్రధాన అంశాలు ఇవేనా?

Last Updated : Sep 28, 2019, 5:09 AM IST

ABOUT THE AUTHOR

...view details