తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మన్మోహన్​కు కరోనా నెగిటివ్​- నిలకడగా ఆరోగ్యం

అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు దిల్లీ ఎయిమ్స్ వైద్య వర్గాలు తెలిపాయి. కరోనా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించాయి.

By

Published : May 11, 2020, 8:17 PM IST

Manmohan Singh's condition improving
మన్మోహన్​కు కరోనా నెగిటివ్​-నిలకడగా ఆరోగ్యం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం మెరుగుపడినట్లు తెలిపాయి దిల్లీ ఎయిమ్స్ వైద్య వర్గాలు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పాయి. కొవిడ్ పరీక్షల్లో మన్మోహన్​కు నెగిటివ్​ వచ్చినట్లు పేర్కొన్నాయి.

అస్వస్థతకు గురై ఆదివారం సాయత్రం ఎయిమ్స్​లో చేేరారు మన్మోహన్​. ఈరోజు ఆయనకు ఎలాంటి జ్వరం లేదని, కొన్ని పరీక్షల ఫలితాలు తెలియాల్సి ఉందని కాంగ్రెస్​ వర్గాలు తెలిపాయి. ఒక్క రోజులో ఆయన డిశ్చార్జి అయ్యే అవకాశాలున్నాయని చెప్పాయి.

ABOUT THE AUTHOR

...view details