తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వెంకయ్య నిర్ణయం... మన్మోహన్​కు కీలక బాధ్యత - దిగ్విజయ్

మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​.. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు.  కాంగ్రెస్ సీనియర్​ నేత దిగ్విజయ్ సింగ్​ స్థానాన్ని ఈమేరకు మన్మోహన్​తో భర్తీ చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

వెంకయ్య నిర్ణయం...మన్మోహన్​కు కీలక బాధ్యత

By

Published : Nov 11, 2019, 4:52 PM IST

రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పట్టణాభివృద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో దిగ్విజయ్​సింగ్​కు చోటు కల్పించడం వల్ల ఆర్థిక వ్యవహారాల కమిటీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. దిగ్విజయ్​ స్థానంలో మన్మోహన్​ను నియమించారు వెంకయ్య.

2014 నుంచి 2019 జూన్‌ వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడూ ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఉన్నారు మన్మోహన్​.

గతంలో మన్మోహన్​ సింగ్​ రెండు పర్యాయాలు భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 1991-96 మధ్యకాలంలో పీవీ నరసింహరావు హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది ఆగస్టులో రాజస్థాన్​ నుంచి ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ఇదీ చూడండి: అయోధ్య తీర్పు 'సమీక్ష'పై త్వరలో నిర్ణయం!

ABOUT THE AUTHOR

...view details