ఆ రాష్ట్రంలో గురువారం నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్
ఆ రాష్ట్రంలో రేపటినుంచి పూర్తిస్థాయి లాక్డౌన్
18:36 July 22
మణిపుర్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 14రోజులు పూర్తిగా లాక్డౌన్ విధించనున్నట్లు వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.
మణిపుర్లో ఒక్కరోజే 45 మందికి వైరస్ సోకింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 2,060కు చేరుకుంది. ఇప్పటివరకు 1,418 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. వైరస్‌తో ఒక్క మరణం కూడా సంభవించలేదు. మరో 642మంది చికిత్స పొందుతున్నారు.
Last Updated : Jul 22, 2020, 7:31 PM IST