తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైరల్​: బావిలోకి దిగి శునకాన్ని కాపాడిన మహిళ - karnataka viral vieo

సాధారణంగా బావిలో ఏదైన పడితే.. అందులో దిగేందుకు పురుషులే భయపడతారు. కొంత మంది ధైర్యం చేసి అందులోకి దిగుతారు. వీధి శునకం బావిలో పడితే.. ఓ మహిళ ధైర్యంతో బావిలోకి దిగి దానిని కాపాడింది. 30 అడుగుల లోతైన బావిలోకి దిగిన మహిళ ధైర్యసాహసాలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Mangaluru woman saves stray dog from 30 ft deep well video goes viral in karnataka
ఔరా: బావిలోకి దిగి శునకాన్ని కాపాడిన మహిళ

By

Published : Feb 2, 2020, 2:06 PM IST

Updated : Feb 28, 2020, 9:30 PM IST

'మేం జంతు ప్రేమికులం.. మూగ జీవాలను హింసిస్తే ఊరుకోం..' అంటూ.. వాటితో సెల్ఫీలు దిగి లైకులు కొల్లగొట్టే వారు అవి ప్రమాదంలో ఉన్నప్పుడు పట్టించుకోరు. కానీ, అలాంటి ప్రగల్భాలేవి పలకడం ఎరుగని ఓ మహిళ వీధి కుక్కను కాపాడేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టింది. ప్రమాదవశాత్తు 30 అడుగుల లోతైన బావిలో పడిన శునకాన్ని బయటికి తీసేందుకు ఏ మాత్రం ఆలోచించకుండా బావిలోకి దిగింది.

ఔరా: బావిలోకి దిగి శునకాన్ని కాపాడిన మహిళ

బావిలో దిగిన ఆమె.. ఆ శునకానికి తాడు కట్టగా పైన ఉన్నావారు దానిని బయటకి లాగారు. అనంతరం ఆమె బావి నుంచి సురక్షితంగా పైకి వచ్చింది. ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ శునకం బతుకుజీవుడా అనుకుంటూ పరుగులు తీసింది.

బావిలో తాళ్ల సాయంతో వేలాడుతున్న మహిళ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్​లో పంచుకున్నారు. 'కుక్కను కాపాడిన మహిళను దీవించండి' అంటూ క్యాప్షన్​ కూడా పెట్టేసరికి.. వీడియోకు కామెంట్లు వెల్లువెత్తాయి..ప్రాణాలకు తెగించి శుకానికి జీవం పోసిన ఆమె తెగువకు ఎన్ని అవార్డులిచ్చినా తక్కువేననని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.

ఇదీ చదవండి:హాకీ మైదానంలో బాల్​బాయ్​గా 'మహ్మద్​ కైఫ్' ​

Last Updated : Feb 28, 2020, 9:30 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details