మాస్టర్ ప్రణేశ్.. కర్ణాటక మంగళూరులోని ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి. రచనల పట్ల ఆసక్తి ఉన్న ఇతను గతంలో ఎన్నో పద్యాలు రాశాడు. అదీ తులూ భాషలో. అయితే.. కరోనా లాక్డౌన్ కాలంలో ప్రణేశ్ రాసిన 'తులునాద ఇసిరీ' అనే ఓ పద్యానికి విపరీతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఏకంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించింది.
అతిపెద్ద పద్యానికి ప్రపంచ రికార్డు ఏంటి ప్రత్యేకత..?
పద్యం రాస్తే ప్రపంచ రికార్డు ఏంటి అనుకుంటున్నారా.. ? ప్రణేశ్ రాసింది అతిపెద్ద పద్యం మరి. 2 వేల 241 తులూ పదాలను ఉపయోగించి.. పేజీల కొద్దీ రాశాడు. ఇది కొలిస్తే 21 అడుగుల మేర ఉంటుందట. మొత్తం 108 పేరాలు, 432 లైన్లలో.. తన కవితా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.
పద్యంలో తులూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తన ప్రతిభకు సానబెట్టాడు ప్రణేశ్. ఇంకా దైవారాధన, ఆధ్యాత్మిక కేంద్రాలు, తులూ పండుగలు, సాంస్కృతిక పోటీల ప్రాముఖ్యాన్ని వివరించాడు.
తులునాద ఇసిరీ పద్యాన్ని చూపిస్తూ ప్రణేశ్ ప్రణేశ్ గతంలోనూ ఎన్నో తులూ పద్యాలు రాశాడు. తన బహుముఖ ప్రజ్ఞకు గుర్తింపుగా అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నాడు.