కర్ణాటక మండ్యలోని కేఆర్ పేట్ తాలుకా కట్టరగట్ట గ్రామంలో ఓ రోబో అద్భుతం చేసింది. చెరువులో పడిపోయిన బంగారు గొలుసును చిటికెలో పట్టేసి శభాష్ అనిపించుకుంది.
వినాయకుడి నిమ్మజ్జనం సమయంలో ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మెడలోంచి బంగారు గొలుసు పొరపాటుగా జారి చెరువులో పడిపోయింది. నీటి అడుగుకు చేరుకున్న గొలుసు మళ్లీ దొరకదనుకున్నారు. కానీ మంజునాథ్ తన రోబోతో ఓసారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు. నీటిలోకి రోబోను వదిలి గాలించారు. కొద్ది సమయంలోనే ఆ గొలుసును పట్టేసింది ఈ రోబో.