కేరళలో ఓ ఫేస్బుక్ స్నేహితుణ్ని కలవడానికి వెళ్లిన వ్యక్తికి ఏకంగా రూ.కోటి లాటరీ తగిలింది. దీంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు కర్ణాటకలోని మండ్యకు చెందిన సోహన్ బలరామ్.
ఫ్రెండ్ను కలవడానికి వెళ్తే.. రూ.కోటి లాటరీ - kerala
అదృష్టం అంటే అతడిదే. ఫేస్బుక్ మిత్రుడిని కలవడానికి వెళ్లిన వ్యక్తికి రూ.కోటి లాటరీ తగిలింది. ఇంతకీ అతడు ఎవరో తెలుసా?
![ఫ్రెండ్ను కలవడానికి వెళ్తే.. రూ.కోటి లాటరీ Mandya man wins RS1 Crore Bumper lottery, When He moved to meet Facebook Friend](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10561053-387-10561053-1612877427568.jpg)
ఫ్రెండ్ని కలవడానికి వెళ్తే.. రూ.కోటి లాటరీ
కేరళలోని తన ఫేస్బుక్ మిత్రుడిని కలవడానికి శనివారం కేరళ వెళ్లాడు సోహన్. తిరుగు పయనంలో అతడిని లాటరీ కొనుగోలు చేయాల్సిందిగా అతడి స్నేహితులు బలవంతం చేశారు. కాదనలేక రూ.100తో పుత్తనథని నగరంలోని ఓ షాప్లో భాగ్యధార లాటరీ కొనుగోలు చేసిన సోహన్నే.. అదృష్ట దేవత వరించింది.