తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళ కడుపు నుంచి 4కిలోల కణితి తొలిగింపు - అరుదైన శస్త్రచికిత్స

కర్ణాటక మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఓ మహిళ కడుపులోని 4 కేజీల కణితిని విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి తొలగించారు.

4 కేజీల కణితిని తొలగించిన ప్రభుత్వ వైద్యులు

By

Published : Jul 3, 2019, 3:27 PM IST

4 కేజీల కణితిని తొలగించిన ప్రభుత్వ వైద్యులు

ఓ మహిళ కడుపులో ఉన్న 4 కేజీల కణితిని విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తొలగించిన ఘటన కర్ణాటక మండ్య జిల్లాలో జరిగింది.

తులసీ అనే మహిళ తీవ్రమైన కడుపు నొప్పితో శ్రీరంగపట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు... ఆమె కడుపులో కణితి ఉందని నిర్ధరించారు. 4 కేజీల కణితిని శస్త్రచికిత్స చేసి తొలగించాలని నిర్ణయించారు.

ప్రభుత్వ వైద్యులు డా. మారుతి, డా.మహేష్​, డా.కుమార్ కలిసి గంటన్నర సమయం పాటు శస్త్రచికిత్స​ చేసి విజయవంతంగా ఆ కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వారు తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అతితక్కువ వైద్య సౌకర్యాలతోనే విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన వైద్యులపై స్థానికులు ప్రశంసలు కురుపిస్తున్నారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​కు నేను అధ్యక్షుడ్ని కాదు: రాహుల్​

ABOUT THE AUTHOR

...view details