కార్చిచ్చుల కారణంగా వేల ఎకరాల అడవులు బూడిద కావడం చూసి తట్టుకోలేకపోయాడు ఆ రైతు. అడవితల్లిని అగ్ని నుంచి కాపాడాలని అనుకున్నాడు. సహచరులతో కలిసి అనేక పరిశోధనలు చేశాడు. చివరకు విజయం సాధించాడు. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఈ ఆవిష్కరణకు పలువురి ప్రశంసలు అందుతున్నాయి.
మండీ జిల్లా సుందర్‌నగర్‌లోని ద్రమణ్ గ్రామానికి చెందిన శ్రవణ్‌కుమార్... పైన్ చెట్ల ఆకులతో ఈ బొగ్గును తయారు చేశాడు. అడవుల్లో ఆకులన్నీ ఏరేసి, ఇలా బొగ్గుగా మార్చితే... కార్చిచ్చుల ముప్పు చాలా వరకు తగ్గుతుంది. ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు. మండేటప్పుడు పొగ రాకపోవడం ఈ బొగ్గు ప్రత్యేకత.
తయారీ విధానం
పొగరహిత బొగ్గు తయారీ కోసం 200 లీటర్ల నీళ్లలో 25 కిలోల పైన్ ఆకులను వేయాలి. ఇందులో మట్టి కలిపి, ఉడికించాలి. మిశ్రమం బొగ్గు రూపంలోకి మారుతుంది.