మాస్కు ధరించని వారు విధిగా కొవిడ్-19 కేర్ సెంటర్స్‌లో పని చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. మాస్కు ధరించని వ్యక్తులు తమ ఆరోగ్యంతోపాటు, ఇతరుల ఆరోగ్యానికీ హాని చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారితో 5 నుంచి 15 రోజుల పాటు రోజుకు 4-5 గంటలు కొవిడ్-19సెంటర్స్‌లో పని చేయించాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. వీరికి వైద్య సేవలు కాకుండా ఇతర పనులు కేటాయించాలని సూచించింది. హైకోర్టు నిర్ణయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది.