హిమాచల్‌ప్రదేశ్ కులులో గత మూడు రోజులుగా కురుస్తున్న మంచుతో అక్కడి వాతావరణం ఆహ్లాదంగా మారింది. ఎటుచూసినా మంచు కనిపిస్తుండటం కళ్లకు కనువిందుగా ఉంది. లోయ అందాలను చూసేందుకు పర్యటకులు తరలివెళుతున్నారు. కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
కులులో హిమపాతం- ప్రకృతిపై ప్రేమలో పర్యటకులు - కులులో మంచు
హిమపాతంతో హిమాచల్‌ప్రదేశ్ కులు వీధులు మంచుతో నిండిపోయాయి. శ్వేతవర్ణం సంతరించుకున్న లోయ అందాలు చూసేందుకు పర్యటకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మంచు కారణంగా లేహ్- మనాలి రహదారి మూతపడింది.
కులులో హిమపాతం- ప్రకృతిపై ప్రేమలో పర్యటకులు
పలు ప్రాంతాల్లో మంచు పేరుకుపోయి రవాణాకు ఆటంకం ఏర్పడింది. పర్యటకులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అటల్ టన్నెల్ ఉత్తర భాగంవైపు భారీగా మంచు కురుస్తుండటం వల్ల లేహ్-మనాలి రహదారిని మూసివేశారు అధికారులు.
ఇదీ చూడండి-వీడియో వైరల్: జనావాసాల్లో చిరుత సంచారం