కర్ణాటకకు చెందిన సురేశ్.. డబ్బు కోసం నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 23 మంది మహిళలను మోసం చేశాడు. విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్. కానీ చివరికి పోలీసులకు చిక్కాడు.
ఇలా దొరికాడు...
కర్ణాటకకు చెందిన సురేశ్.. డబ్బు కోసం నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 23 మంది మహిళలను మోసం చేశాడు. విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్. కానీ చివరికి పోలీసులకు చిక్కాడు.
ఇలా దొరికాడు...
మైసూరుకు చెందిన సురేశ్.. డబ్బు కోసం మహిళలను మోసం చేయడమే వృత్తిగా చేసుకున్నాడు. విడాకులు తీసుకున్న మహిళలే అతడి లక్ష్యం. మాట్రిమోనీల్లో తన ప్రొఫైల్ పెట్టి.. మహిళలకు ఎరవేసేవాడు. తాను మంచి వాడినని నమ్మించే వాడు. తనను పెళ్లి చేసుకోమనే వాడు. అక్కడే అతడి ప్లాన్ మొదలయ్యేది. అలా వారిని నమ్మించి.. వారి నుంచి డబ్బులు తీసుకుని పరారయ్యేవాడు.
ఇదే క్రమంలో మాట్రిమోనీలో ఓ మహిళతో సురేశ్‌కు ఇటీవలే పరిచయమైంది. కొంతకాలం తరువాత... ఆమె వద్దకు పెళ్లి ప్రతిపాదన తీసుకెళ్లాడు. సొంతింటి కలలు నిజం చేసుకోవడం కోసం.. భూమిని కొనాలని, అందుకు సహాయం చేయాలని ఆ మహిళను కోరాడు. సురేశ్‌ను నమ్మిన ఆమె... రూ. 10లక్షలు, 80గ్రాముల బంగారాన్ని ఇచ్చింది. అంతే ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్ఛాఫ్.
తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ... బైదరహళ్లి పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు సురేశ్ కోసం గాలించిన పోలీసులు.. అతడిని పట్టుకున్నారు. విచారణలో భాగంగా.. ఇప్పటి వరకు తాను నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్టు, 23 మంది మహిళలను మోసం చేసినట్టు అంగీకరించాడు సురేశ్.