తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హాకీ కర్ర విరిగేలా నిందితుడ్ని కొట్టిన పోలీస్​..! - వ్యక్తి

ఓ పోలీసు అధికారి విచక్షణ కోల్పోయి.. నిందితుడిపై విరుచుకుపడ్డారు. హాకీ కర్రతో చితకబాదారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

నిందితుడ్ని హాకీ కర్ర విరిగేలా కొట్టిన పోలీస్​..!

By

Published : Sep 13, 2019, 10:22 AM IST

Updated : Sep 30, 2019, 10:35 AM IST

నిందితుడ్ని హాకీ కర్ర విరిగేలా కొట్టిన పోలీస్​..!

మహిళను వేధిస్తున్నాడనే అనుమానంతో.. ఓ వ్యక్తిని బెంగళూరు పోలీసు అధికారి విచక్షణారహితంగా కొట్టారు. ఆ వ్యక్తి కాళ్లను తాడుతో కట్టి చితకబాదారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ జరిగింది...

యశ్వంత అనే వ్యక్తి బెంగళూరులోని ప్రపంచ వాణిజ్య సముదాయంలో సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్నాడు. యశ్వంత తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సుబ్రమణ్య నగర్​ పోలీస్​ స్టేషన్​లోని సబ్​ ఇన్స్​పెక్టర్​.. యశ్వంతను విచక్షణారహితంగా కొట్టారు. హాకీ కర్ర విరిగేలా చితకబాదారు.

అక్కడే ఉన్న ఇతర సిబ్బందికి సబ్​ ఇన్స్​పెక్టర్​ ప్రవర్తన నచ్చలేదు. ఆయన చర్యలను వ్యతిరేకిస్తూ... ఆ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్​లోడ్​ చేశారు. ఆ వీడియో వైరల్​గా మారింది. సదరు పోలీస్​ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.

ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు నార్త్​ డివిజన్​ డీజీపీ తెలిపారు. సంబంధిత అధికారి తప్పు చేసినట్లు తెలిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి:-పచ్చని 'కప్ప'ల కాపురంలో విడాకుల చిచ్చు!

Last Updated : Sep 30, 2019, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details