కేరళ కొట్టాయంలో కరోనా పరిశీలనలో ఉన్న 41 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. సదరు వ్యక్తి స్వతహాగా లారీ డ్రైవర్. ఈనెల 18న ముంబయి నుంచి వచ్చినట్లు గుర్తించిన అధికారులు కుమారాకోంలో నిర్బంధించారు.
కేరళలో కరోనా అనుమానితుడు మృతి - Man under observation for coronavirus dies in Kerala
కేరళలో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి మరణించినట్లు అధికారులు వెల్లడించారు. లారీ డ్రైవర్ అయిన అతను ఇటివలే ముంబయి నుంచి రాగా.. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో గృహ నిర్బంధంలో ఉంచారు అధికారులు.
కేరళలో కరోనా అనుమానితుడు మృతి
అయితే ఇవాళ తన ఇంట్లో అకస్మారక స్థితిలో పడి ఉన్న డ్రైవర్.. మృతి చెందనట్లు ధ్రువీకరించారు. మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:కరోనా కట్టడికి ముఖ్యమంత్రులు, గవర్నర్లతో మోదీ భేటీ