మనం జ్యువెలరీ దుకాణానికి వెళ్లి నగదు చెల్లించి నచ్చిన నగను కొనుక్కొని వెళ్తాం. ఓ వ్యక్తి మాత్రం.. కారం తీసుకొని వెళ్లి నగలను దొంగతనం చేయటానికి ప్రయత్నించాడు. అది కాస్త విఫలమవ్వటం వల్ల ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. మధ్యప్రదేశ్ ఇందోర్ ప్రాంతంలో జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది..
లవీన్ సోనీ.. సరాఫా ప్రాంతంలో నగల దుకాణం నడుపుతున్నాడు. గురువారం సాయంత్రం 6:30 గంటలకు ఓ వ్యక్తి సాధారణ వినియోగదారునిలాగే షాపులోకి ప్రవేశించాడు. మాట్లాడుతూ కాసేపటికి షాపు యజమాని కళ్లలో కారం జల్లి 45-50 గ్రాముల బంగారంతో ఉడాయించాలని ప్రయత్నించాడు. తప్పించుకునే సమయంలో సోనీ కేకలు వేయగా.. షాపు బయట ఉన్న వ్యక్తులు ఆ ఘరానా దొంగను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు షాపులోని సీసీటీవీలో రికార్డయ్యాయి.
కళ్లలో కారంకొట్టి బంగారం చోరీకి యత్నం ఈ ఘటనపై సోనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు.
ఇదీ చూడండి'యోగీ హయాంలో యూపీలో భారీగా తగ్గిన నేరాలు'