గుజరాత్‌లోని జూనాగఢ్‌లో దారుణం జరిగింది. వరుసగా నాలుగోసారీ ఆడపిల్లే పుట్టిందన్న ఆగ్రహంతో రసిక్ సోలంకి అనే వ్యక్తి.. అంతకుముందు పుట్టిన ముగ్గురు కుమార్తెలను హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. తనకూతుళ్లను ఇంటి సమీపంలోని బావిలోకి తోసి హతమార్చాడు.
ముగ్గురు కుమార్తెలను చంపి తండ్రి ఆత్మహత్య - తండ్రి ఆత్మహత్య
నాలుగోసారి ఆడపిల్లే పుట్టిందన్న ఆగ్రహంతో తన ముగ్గురు కుమార్తెలను తండ్రి హత్య చేసి.. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుజరాత్‌లోని జూనాగఢ్‌లో చోటుచేసుకుంది. ముగ్గురిని ఇంటి సమీపంలోని బావిలోకి తోసి హత్య చేశాడు తండ్రి. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ముగ్గురు కుమార్తెలను చంపి తండ్రి ఆత్మహత్య
మృతిచెందిన చిన్నారులు అంజలి, రియా, జల్పగా గుర్తించారు పోలీసులు. కుమార్తెలను హత్య చేసిన అనంతరం ఆ తండ్రి.. ఊరి బయట ఉరి వేసుకొని మరణించినట్లు తెలిపారు. సోలంకి.. తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నాడని, 10 రోజుల క్రితం తన భార్య మళ్లీ ఆడపిల్లకే జన్మనిచ్చిందనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: శివసేన కార్యకర్తపై కాల్పులు.. దుండగుడి అరెస్టు
Last Updated : Dec 19, 2019, 1:31 PM IST