దేశంలో అత్యధిక కరోనా కేసులకు కేరాఫ్‌గా నిలిచిన మహారాష్ట్రలో ఓ నవవరుడికి మహమ్మారి సోకింది. దీంతో వధువు సహా, పెళ్లికి హాజరైన బంధువులందరూ క్వారంటైన్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.
పాల్ఘర్లోని ఓ ఆసుపత్రిలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ యువకుడికి మూడు రోజుల క్రితమే పెళ్లైంది. వివాహానికి ముందు కరోనా పరీక్షలు నిర్వహించినప్పుడు.. నెగటివ్‌గానే తేలింది. కానీ, పెళ్లైన 3 రోజుల తర్వాత అతడి నమూనాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. దీంతో అతడి భార్య, 63 మంది బంధువులను నిర్బంధంలోకి పంపారు అధికారులు.