తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​కౌంటర్​ చేయొద్దంటూ ప్లకార్డుతో లొంగిపోయిన గ్యాంగ్​స్టర్

"నా తప్పు తెలుసుకున్నాను, నేను లొంగిపోతున్నాను" అంటూ ఓ గ్యాంగ్​స్టర్ పోలీస్​ స్టేషన్​కు ప్లకార్డు పట్టుకొని వెళ్లిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ సంభల్​లో జరిగింది. సదరు వ్యక్తిని రౌడీషీటర్​ నయిమ్​గా గుర్తించారు పోలీసులు.

Man surrenders in UP with 'Don't Shoot Me' placard
ఎన్​కౌంటర్​ చేయవద్దంటూ ప్లకార్డుతో లొంగిపోయిన గాంగ్​స్టర్

By

Published : Sep 28, 2020, 1:53 PM IST

ఉత్తర్​ప్రదేశ్ కాన్పుర్​లో రౌడీషీటర్​ వికాస్​ దుబేను ఎన్​కౌంటర్​ చేసినప్పటి నుంచి పలువురు నేరస్థులు తమని చంపవద్దంటూ ప్లకార్డులు పట్టుకొని పోలీసులకు లొంగిపోతున్నారు. తాజాగా 'సంభల్​ పోలీసులకు భయపడుతున్నాను, నా తప్పు తెలుసుకున్నాను.. నేను లొంగిపోతానంటూ' ఓ గ్యాంగ్​స్టర్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ నఖానా పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

ప్లకార్డుతో నయీమ్​

సదరు వ్యక్తిని రౌడీషీటర్​ నయీమ్​గా గుర్తించారు పోలీసులు. గతంలో అతనిపై ఉత్తర్​ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్స్, యాంటీ సోషల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద పలు కేసులు నమోదయ్యాయి. దీంతో అతని తలపై రూ. 15 వేల రివార్డు ప్రకటించారు అధికారులు. ఈ నేపథ్యంలో తనని ఎన్​కౌంటర్​ చేసి చంపవద్దంటూ ప్లకార్డు పట్టుకొని పోలీసులకు లొంగిపోయాడు నయీమ్​.

ఈ విధంగా ప్లకార్డులతో ఒక నేరస్థుడు పోలీసుల ఎదుట లొంగిపోవటం ఇది మొదటిసారి కాదని స్టేషన్​ అధికారి ధరంపాల్ సింగ్ తెలిపారు. అమ్రోహా, కాన్పుర్లలో కూడా నేరస్థులు ఇలాగే లొంగిపోయారని వెల్లడించారు. ఈ మూడు ఘటనల్లోనూ నేరస్థులు వారి భద్రతా కోసం స్థానిక మీడియాను తీసుకొని వచ్చి మరీ స్టేషన్​లో సరెండర్​ అయ్యారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details