బిహార్ ముంగేర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఖరగ్పుర్ ప్రాంతంలో నివసించే.. భరత్ కేసరి అనే వ్యక్తి కన్న తల్లి, భార్యతో పాటు తన ముగ్గురు కుమార్తెలను హతమార్చాడు. ఆ తర్వాత నిందితుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
అసలు ఏం జరిగింది?
బిహార్ ముంగేర్ జిల్లాలో నివసిస్తున్న భరత్ కేసరి అనే వ్యక్తి గడియారాలను తయారు చేస్తుంటాడు. కొంత కాలంగా అతడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున దారుణానికి ఒడిగట్టాడు. 80 ఏళ్ల వయస్సు ఉన్న తన కన్న తల్లి సహా.. భార్య ఆషా దేవి (45), ముగ్గురు కుమార్తెలైన శివానీ కుమారి (16), సిమ్రాన్ కుమారి (14), సోనమ్ కుమారి(10)లను గొంతునులిమి చంపేసాడు.