తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పొరపాటున భాజపాకు ఓట్​- కోపంతో వేలు కట్​ - వేలు కోసుకున్న ఓ వ్యక్తి

సార్వత్రిక ఎన్నికల రెండో దశలో అనుకోకుండా వేరే పార్టీకి ఓటు వేసిన ఓ ఓటరు... తన వేలును తానే కోసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్​లోని బులంద్​షహర్​ జిల్లాలో జరిగింది.

పొరపాటున భాజపాకు ఓట్​- కోపంతో వేలు కట్​

By

Published : Apr 20, 2019, 10:42 AM IST

ఉత్తరప్రదేశ్​లో గురువారం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. బులంద్​షహర్​ జిల్లాలోని పోలింగ్​ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చి వేలు కోసుకున్నాడు.

ఇదే కారణం...

బులంద్​షహర్​ జిల్లాలోని హులాస్​పూర్​ గ్రామానికి చెందిన 25 ఏళ్ల పవన్​ కుమార్ బహుజన్​ సమాజ్​ పార్టీ(బీఎస్పీ)కి ఓటు వేయడానికి పోలింగ్​ కేంద్రానికి వెళ్లాడు. కానీ ఈవీఎంలో అనుకోకుండా బీఎస్పీకి బదులు భాజపా మీట నొక్కాడు.

ఇంటికి తిరిగిన వచ్చిన పవన్​ ఆగ్రహంతో వేలు కోసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details