తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లి పీటలపైనే ప్రియురాలి హత్య - వివాహం

తాను ప్రేమించిన యువతి వేరే వ్యక్తిని వివాహం చేసుకుంటోందనే ఆగ్రహంలో పెళ్లిపీటలపైనే ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు ఓ యువకుడు. తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పెళ్లి పీటలపైనే ప్రియురాలి హత్య

By

Published : Mar 14, 2019, 6:25 AM IST

పెళ్లి పీటలపైనే ప్రియురాలి హత్య
దేశంలో మరో ఘోర సంఘటన జరిగింది. ప్రియుడి ఘాతుకానికి మరో యువతి బలైంది.

తనను ప్రేమించి మరొకరిని వివాహం చేసుకుంటోందనే ఆగ్రహంతో పెళ్లి పీటలపై ఉన్న యువతిని కాల్చి చంపాడో యువకుడు. పెళ్లి పీటల మీద ఉన్న యువతిపై అందరూ చూస్తుండగానే కాల్పులకు తెగబడడం వల్ల అందరూ భయపడిపోయారు. ఉత్తరప్రదేశ్​ రాయ్​బరేలీలోని గజిపూర్​లో ఈ ఘటన జరిగింది.

మృతి చెందిన యువతి పేరు ఆశ. నిందితుడిని బ్రిజేంద్రగా గుర్తించారు పోలీసులు. బ్రిజేష్, ఆశ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి వివాహానికి ఆశ కుటంబ పెద్దలు అభ్యంతరం తెలిపారు. తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గిన ఆశ... వేరే వ్యక్తితో పెళ్లికి అంగీకరించింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని బ్రిజేంద్ర ఆశను తుపాకీతో కాల్చాడు. అనంతరం అదే తుపాకీతో తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

"ఆ యువకుడు వివాహానికి హాజరయ్యాడు. వధువుతో ఫోటోలూ దిగాడు. కానీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఏం జరిగిందో అర్థమయ్యే సరికి వధువును తుపాకీతో కాల్చాడు"
---- రమేష్​, స్థానికుడు.

ఈ ఘటనలో ఆశ అక్కడికక్కడే మృతి చెందింది. బ్రిజేష్​ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.​

ABOUT THE AUTHOR

...view details