ఆస్తి కోసమో లేక డబ్బు కోసమో హత్యలు చేశారన్న వార్తలు వింటుంటారు.. కానీ 'పాల' కోసం హత్య చేయడం ఎక్కడైనా విన్నారా? అవును మీరు విన్నది నిజమే. ఉత్తర్ప్రదేశ్ పురాన్పుర్లోని ఘుంగ్ఛాయ్లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో 16 ఏళ్ల తన కొడుకును తుపాకితో కాల్చి తానూ ప్రాణాలొదిలాడు 55 ఏళ్ల గుర్ముఖ్ సింగ్ అనే వ్యక్తి.
'పాలు' తాగాడని కన్న కొడుకును చంపిన తండ్రి! - 'పాలు' తాగాడని కన్న కొడుకును కాల్చి చంపిన తండ్రి!
ఉత్తరప్రదేశ్ ఘుంగ్ఛాయ్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన కోసం దాచుకున్న పాలు తాగాడని కన్న కొడుకునే హతమార్చాడు ఓ తండ్రి. అనంతరం తానూ తుపాకితో కాల్చుకుని ప్రాణాలొదిలాడు.
!['పాలు' తాగాడని కన్న కొడుకును చంపిన తండ్రి! Man shoots son, kills self over dispute on consumption of milk](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6699455-thumbnail-3x2-asp.jpg)
'పాలు' తాగాడని కన్న కొడుకును కాల్చి చంపిన తండ్రి!
గుర్ముఖ్ సింగ్ తన కోసం దాచుకున్న పాలను ఆయన పుత్రుడు జస్కరన్ తాగడం వల్లే ఈ విషాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశంపై ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండగా.. ఆపాలని చూసిన తన తమ్ముడినీ గుర్ముఖ్ గాయపరిచినట్లు పేర్కొన్నారు. అయితే అతను హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లడం వల్ల ప్రాణాలు దక్కించుకున్నట్లు వివరించారు.
సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును ప్రారంభించారు.
Last Updated : Apr 7, 2020, 6:04 PM IST