బాలికలపై మృగాళ్ల పైశాచికత్వంపై రోజూ వార్తలు వింటూనే ఉన్నాం. వయస్సుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. మైనర్లపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట పడటంలేదు. కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నా.. మృగాళ్లు పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.
కేరళ పాలక్కడ్ జిల్లాలోని త్రితాలా గ్రామంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన 59 మంది బాలికలపై కృష్ణన్(57) అనే దుకాణదారుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చాక్లెట్లు కొనుక్కోవడానికి దుకాణానికి వచ్చినవారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించేవాడు.