తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అత్యాచార దోషికి 17 రోజుల్లోనే శిక్ష విధించిన కోర్టు

అత్యాచార ఘటనపై సత్వరమే విచారణ చేపట్టి కేవలం 17 రోజుల్లోనే శిక్ష విధించిన ఘటన రాజస్థాన్​లో జరిగింది. సెప్టెంబర్ 30న ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. కేవలం ఏడు రోజుల్లోనే ఛార్జిషీట్ నమోదు చేసి పోలీసులు సత్వర న్యాయానికి బాటలు పరిచారు.

By

Published : Dec 18, 2019, 7:37 PM IST

Man sentenced to life imprisonment within 17 days of raping girl
అత్యాచార నిందితుడికి 17రోజుల్లోనే శిక్ష విధించిన న్యాయస్థానం

రాజస్థాన్​లో ఓ బాలికను అత్యాచారం చేసిన దుర్మార్గుడికి ప్రత్యేక పోక్సో న్యాయస్థానం కేవలం 17 రోజుల్లోనే జీవితఖైదు శిక్ష విధించింది. సాక్ష్యాధారాలతో ఏకీభవించిన కోర్టు.. దోషిగా తేలిన 21 ఏళ్ల దయారాం మేఘ్​వాల్​కు శిక్ష ఖరారు చేసింది.

రాజస్థాన్​లోని చూరు జిల్లాలో నవంబర్ 30న ఓ బాలికను అత్యాచారం చేసిన మేఘ్​వాల్​ను స్థానిక పోలీసులు మరుసటి రోజే అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ, పోక్సో(లైంగిక నేరాల నుంచి బాలలను రక్షించే చట్టం) ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 7న ఛార్జిషీట్ నమోదు చేశారు. ఈ కేసుపై మంగళవారం తీర్పు వెలువడింది.

"పోలీసులు సత్వర చర్యలు చేపట్టి 7 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి అభియోగ పత్రాలు(ఛార్జిషీట్) నమోదు చేశారు. కోర్టులో రోజువారీగా వాదనలు జరిగాయి. బాధితురాలి వాంగ్మూలం, శాస్త్రీయ ఆధారాలు కేసులో కీలకంగా వ్యవహరించాయి."-తేజస్వీ గౌతమ్, ఎస్​పీ, చూరు

మేఘ్​వాల్​ తండ్రి కూడా గతంలో అత్యాచార కేసులో జైలుకు వెళ్లినట్లు తేజస్వీ తెలిపారు. ​

ఇదీ చదవండి: భారత బ్యాట్స్​మెన్​ 'హిట్​' షో... విండీ లక్ష్యం 388

ABOUT THE AUTHOR

...view details