తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మునిగిపోతున్న శిశువును తల్లి చెంతకు చేర్చి.. - havoc bengalore rain

భారీ వర్షాలకు బెంగళూరు నగరం నదిని తలపిస్తోంది. వరద ధాటికి హొసకెరెహళ్లి ప్రాంతంలోని ఇళ్లు నీటమునిగాయి. పూర్తిగా మునిగిపోయిన ఇంటి నుంచి 15రోజుల శిశువును ఓ యువకుడు రక్షించాడు. ఆ చిన్నారిని తలపై పెట్టుకొని జాగ్రత్తగా తల్లి చెంతకు చేర్చాడా యువకుడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

man -resques- 15 day -child- from -floods - bengalore
మునిగిపోతున్న శిశువును తల్లి చెంతకు చేర్చిన యువకుడు

By

Published : Oct 24, 2020, 1:55 PM IST

కర్ణాటక బెంగళూరు హొసకెరెహళ్లి ప్రాంతంలో పూర్తిగా నీటమునిగిన ఇంటినుంచి 15రోజుల పసికందుని ప్రాణాలకు తెగించి కాపాడాడు ఓ యువకుడు. శిశువు ఆర్తనాదాలు విన్న యువకుడు చలించిపోయాడు. వరద ప్రవాహంలో చంటి బిడ్డను జాగ్రత్తగా నెత్తిన పెట్టుకొని తీసుకెళ్లి తల్లికి అప్పగించాడు. అదే రోజు మరొక చోట ఒక బాలికను సైతం కాపాడి చంటి పిల్లల పాలిట ఆపద్బాంధవుడు అయ్యాడా యువకుడు.

మునిగిపోతున్న శిశువును తల్లి చెంతకు చేర్చిన యువకుడు

వర్ష బీభత్సం :

బెంగళూరును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వరదకు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి.హొసకెరెహళ్లి ప్రాంతం నదిని తలపిస్తోంది. అక్కడి దత్తాత్రేయ స్వామి దేవాలయం పూర్తిగా నీట మునిగింది. వరద ప్రవాహానికిపలువాహనాలు కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని అనేక భవనాలు, దేవాలయాలకు పగుళ్లు ఏర్పడ్డాయి.

రోడ్లన్నీ జలమయం

కర్ణాటక మంత్రి ఆర్​ అశోక్​ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు ధైర్యం చెప్పారు. జాతీయ విపత్తు నిర్వాహక బృందం 20 పడవలను రంగంలోకి దింపింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

వరద ధాటికి దెబ్బతిన్న కాలనీలు

ABOUT THE AUTHOR

...view details