కేరళ తిరువనంతపురంలో ఓ కార్మికుడు కొండచిలువ బారి నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. తోటి కార్మికులు సకాలంలో స్పందించకపోతే అతని ప్రాణాలు పోయేవి.
కొండ చిలువ బారి నుంచి త్రుటిలో తప్పించుకున్న భువన - snake coils around man neck
కొండచిలువ బారి నుంచి ఓ కార్మికుడు త్రుటిలో తప్పించుకున్న ఘటన కేరళ తిరువనంతపురంలోని కల్లికాడ్లో జరిగింది. 'మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం' పనుల్లో ఉన్న భువనచంద్రన్ నాయర్ మెడకు కొండచిలువ చుట్టుకుంది. సకాలంలో స్పందించిన తోటి కార్మికులు ఆయనను పాము బారి నుంచి రక్షించారు.
![కొండ చిలువ బారి నుంచి త్రుటిలో తప్పించుకున్న భువన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4772301-thumbnail-3x2-rescue.jpg)
కట్టకడలోని కల్లికాడ్లో 'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం' కింద కిక్మా కళాశాల ప్రాంగణంలో పనులు జరుగుతున్నాయి. పెరుంకులంగరకు చెందిన భువనచంద్రన్ నాయర్ కూడా పనులు చేస్తున్నాడు. అకస్మాత్తుగా ఓ కొండచిలువ ఆయన మెడకు చుట్టుకుంది. దానిని విడిపించుకోవడం అతని వల్ల కాలేదు. సకాలంలో స్పందించిన తోటి కార్మికులు పాము మెడ, తోక పట్టుకుని విడదీసి నాయర్‌ను రక్షించారు. పాము మరికొంత సమయం అలాగే పట్టుకుని ఉంటే నాయర్ ప్రాణాలు పోయేవి. తరువాత అటవీశాఖ అధికారులు పామును సురక్షితంగా అభయారణ్యంలో విడిచిపెట్టారు.
ఇదీ చూడండి:డ్రీమ్ గర్ల్ హేమ మాలిని బుగ్గల్లా రోడ్లు: మంత్రి