బహిరంగ మలవిసర్జన అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని ఎన్ని సార్లు చెప్పినా ఆ అలవాటు మానుకోవడం లేదు కొందరు. అందుకే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బహిరంగ మలవిజర్జనకు పాల్పడ్డవారికి భిన్నమైన శిక్షలు విధిస్తూ.. స్వచ్ఛ భారత్ వైపు అడుగులు వేస్తున్నారు అధికారులు.
అలా చేస్తే రేషన్ కట్..
మహారాష్ట్ర అనురాగ్ బాద్ జిల్లాలోని జరంది గ్రామంలో బహిరంగ మల విసర్జన చేసినట్టు కనిపిస్తే ఆ కుటుంబాలకు రేషన్ కార్డు రద్దు చేయాలని నిశ్చయించింది గ్రామ పంచాయతీ. ఆదేశాలు ఉల్లంఘించినవారి ఫోటోలు తీసి, సమాచారం ఇస్తే వారికి పన్ను ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించింది.
అనురాగ్బాద్ జిల్లాలో 5 వేలకు పైగా ఇళ్లల్లో మరుగుదొడ్లు నిర్మించారు. సరిపడా నీటి వసతులు ఉన్నాయి. అయినా.. ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన చేసేవారిని అరికట్టలేకపోతున్నారు. అందుకే ఈ అనారోగ్యకరమైన అలవాటును రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడి అధికారులు.