7 అడుగులు వేసినందుకు... 7 ఏళ్ల పాటు బాధ తప్పలేదు ఒడిశా కేంద్రపడ జిల్లాకు చెందిన అభయ్ సుతార్‌కు.. అదే ప్రాంతానికి చెందిన మిలి అనే యువతితో 2013లో వివాహమైంది. రెండు నెలల తర్వాత ఆమె అదృశ్యమైంది. వరకట్నం కోసం తన కుమార్తెను అల్లుడే హత్యచేసి, మృతదేహాన్ని ఎక్కడో పూడ్చి పెట్టి ఉంటాడని అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అభయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు తమదైన శైలీలో అతన్ని విచారించారు. కానీ అభయ్ హత్య చేశాడని పోలీసులు నిరూపించ లేకపోయాడు. నెల రోజుల పాటు పోలీసుల కస్టడిలో ఉన్న అభయ్ బెయిల్‌పై విడుదలయ్యాడు.
ఏడేళ్లపాటు
అభయ్ సుతార్... తాను ఏ నేరమూ చేయలేదని నిరూపించుకునేందుకు... భార్య ఆచూకి కోసం ఏడేళ్లుగా అనేక ప్రాంతాల్లో వెతికాడు. చివరకు పూరీ జిల్లా పిప్పిలిలో అభయ్ భార్య ఆచూకి లభించింది. రాజీవ్‌లోచన్ మహరాణా అనే వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తుండటాన్ని అభయ్ గుర్తించాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు.
పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారం
అభయ్ ఇచ్చిన సమాచారంతో ఫిబ్రవరి 28న మిలి-రాజీవ్‌ను పట్టకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిలి మీద సెక్షన్ 164 కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. పెళ్లికి ముందు నుంచే రాజీవ్, మిలి ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు, మిలి తల్లిదండ్రులు ఆమెకు అభయ్‌తో బలవంతంగా వివాహం చేసినట్లు విచారణతో తేలింది. ప్రియుడి మీద ప్రేమ చావక... పెళ్లైనోడితో కాపురం చేయలేక నెల రోజలకే ప్రియుడితో కలిసి గుజరాత్ వెళ్లిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు.
డిమాండ్
ఏడేళ్లుగా తన వృత్తి జీవితాన్ని.... భవిష్యత్తును కోల్పోయానని అభయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మోసం చేసి వివాహం చేసిన మిలి తల్లితండ్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
ఇదీ చూడండి : 'హెచ్-1బీ' వీసా తిరస్కరణలో భారతీయ టెక్ కంపెనీలే టాప్!