దేశ రాజధాని దిల్లీలోని మహరౌలీలో దారుణ ఘటన జరిగింది. ఒంటి నిండా కర్కశత్వంతో నిండిన ఓ వ్యక్తి... కట్టుకున్న భార్యను, రెండు నెలల చిన్నారి సహా ముగ్గురు కన్నపిల్లలను కడతేర్చాడు. కనికరం లేకుండా వారి గొంతు కోసి హత్య చేశాడు. శుక్రవారం అర్ధరాత్రి భార్య, పిల్లలు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రెండు నెలల పసికందు కూతురిని చూసైనా జాలి కలగలేదు ఆ కఠినాత్ముడికి.
ముగ్గురు పిల్లల్లో బాలుడికి ఐదేళ్లు కాగా, ఏడేళ్ల బాలికతో పాటు రెండు నెలల శిశువు ఉంది.
ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఉపేందర్ శుక్లా... ప్రైవేటు ట్యూటర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులను శుక్లా ఎందుకు హత్యచేశాడో ఇంకా తెలియలేదని అధికారులు చెప్పారు. అతడు మానసిక ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.