తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్య, కుమారుడి హత్య.. కారణం అదే! - భార్య కొడుకును చంపిన కిరాతకుడు

యాభై ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి తన భార్యను, కుమారుడిని ఇనుపకడ్డితో కొట్టి చంపిన ఘటన రాజస్థాన్​ శ్రీగంగనగర్​లో జరిగింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలే ఈ జంట హత్యలకు దారి తీసాయని పోలీసులు తెలిపారు.

Man kills wife, son with iron rod in Rajasthan, later surrenders to police
భార్య, కుమారుడిని కడతేర్చిన కిరాతకుడు

By

Published : Jun 8, 2020, 7:08 PM IST

రాజస్థాన్​ శ్రీగంగనగర్​లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, కొడుకును ఇనుపకడ్డితో కొట్టి హత్యచేశాడు. ఆ తర్వాత రోజు ఉదయం తనంతట తానే పోలీసులకు లొంగిపోయాడు.

ఇదీ జరిగింది...

శ్రీగంగనగర్​ పరిధిలోని ఆర్యన్ గ్రామంలో నివాసముంటున్నారు సత్నం సింగ్​ దంపతులు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కొంతకాలంగా నుంచి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సింగ్​ తన భార్య, కుమారుడిపై ఇనుపకడ్డితో దాడి చేయగా.. ఆ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు మరణించినట్లు గుర్తించిన నిందితుడు.. ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. ఆ తర్వాత రోజు ఉదయం తనంతట తానే లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ఇద్దరి మృతదేహాలను శవపంచనామాకు తరలించినట్లు తెలిపిన పోలీసులు . ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఏసీ కారులో వచ్చి.. ఎడ్లబండి ఎక్కారు!

ABOUT THE AUTHOR

...view details