కర్ణాటకలో భార్యను హత్య చేసి.. బంగాల్‌కు వచ్చి అత్తను చంపిన ఓ ప్రైవేటు ఉద్యోగి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్య , తనయుడితో కలిసి బెంగళూరులో వైట్‌ఫీల్డ్ అపార్ట్మెంట్లో ఉంటున్న 42 ఏళ్ల అమిత్ అగర్వాల్ ఓ ప్రైవేటు ఉద్యోగి. సోమవారం సాయంత్రం కోల్‌కతా కంకుర్గచిలోని అత్తారింటికి చేరుకున్నాడు. అత్త లలితా ధన్ధనియాతో చాలాసేపు వాదించాడు. ఆవేశంలో తుపాకీ తీసి అత్తను అత్యంత సమీపం నుంచే కాల్చి చంపాడు.
ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న మామ సుభాష్ ధన్ధనియా అల్లుడి ప్రవర్తనకు వణికిపోయాడు. తననూ చంపేస్తాడనే భయంతో అల్లుడున్న గదికి గొళ్లెం పెట్టి, బయటికి పరుగులు తీశాడు. ఇరుగు పొరుగు వారి సాయంతో పోలీసులకు ఫోన్ చేశాడు.