తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంతా చూస్తుండగానే.. సినీ ఫక్కీలో వ్యక్తి కిడ్నాప్​ - karnataka kidnapping news

దేశంలో దాడులు, కిడ్నాప్​లు, హత్యలు నానాటికి పెరిగిపోతున్నాయి. సినిమాలను తలపించేలా.. దుండగులు పట్టపగలే రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటనే కర్ణాటక రాయ్​చుర్​లో జరిగింది. సినీ ఫక్కీలో వందల మంది చూస్తుండగానే ఓ వ్యక్తిని కిడ్నాప్​ చేశారు దుండగులు.

అంతా చూస్తుండగానే.. సినీ ఫక్కీలో వ్యక్తి కిడ్నాప్​

By

Published : Nov 16, 2019, 7:11 PM IST

అంతా చూస్తుండగానే.. సినీ ఫక్కీలో వ్యక్తి కిడ్నాప్​

సినీ ఫక్కీలో ఓ వ్యక్తిని పట్టపగలే కిడ్నాప్​ చేసిన ఘటన కర్ణాటకలోని రాయ్​చుర్​ జిల్లా సింగసుగురులో చోటుచేసుకుంది. నడిరోడ్డుపై వందల మంది చూస్తుండగానే తుపాకులు, కత్తులు చూపించి ఈ దారుణానికి ఒడిగట్టారు దుండగులు.

అసలేం జరిగింది?

రోడ్డు పక్కన నిలుచుని ఉన్న ఓ వ్యక్తితో నలుగురు మాటలు కలిపారు. వారంతా స్నేహితులు అనుకునేలా దృశ్యాలు సృష్టించారు. కొద్ది సమయం తర్వాత వారి నిజస్వరూపాన్ని బయట పెట్టారు. కత్తులు, తుపాకులతో బెదిరించి.. ఆ వ్యక్తిని కారులోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. వారిని తీవ్రంగా ప్రతిఘటిస్తూ అరిచాడు ఆ వ్యక్తి. అతని అరుపులతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఆగంతుకుల వద్ద ఉన్న తుపాకులు, కత్తులతో ఆ సాహసం చేయలేకపోయారు. అనంతరం బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు దుండగులు.

కిడ్నాప్​ దృశ్యాలు స్థానిక దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. నంబర్​(ఎంహెచ్​14, 3566)ప్లేట్​తో ఆ వాహనం మహారాష్ట్రకు చెందినదిగా ధ్రువీకరించినట్టు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కళ్ల ముందే మునిగిపోతున్నా కనీసం కాపాడలేదు!

ABOUT THE AUTHOR

...view details