తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసు పరీక్ష రాయడానికి వెళ్లి పట్టుబడ్డ దొంగ - తమిళనాడు

తమిళనాడులోని మధురై జిల్లాలో గొలుసు దొంగతనం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాని అది మామూలు అరెస్టు కాదు.

పోలీసు పరీక్ష రాయడానికి వెళ్లి పట్టుబడ్డ దొంగ

By

Published : Aug 27, 2019, 3:09 PM IST

Updated : Sep 28, 2019, 11:27 AM IST

నేరాలకు పాల్పడే వారిని పోలీసులు అరెస్టు చేయడం సహజం. కానీ ఆ నేరస్థుడు ఏకంగా పోలీసు పరీక్ష రాయడానికి వెళ్లి అధికారులకు చిక్కితే? ఇలాంటి ఘటనే తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది.

ఇతడే ఆ గొలుసు దొంగ

ఇదీ జరిగింది...

మధురై జిల్లాలోని క్రిష్ణపురమ్​లో గొలుసు దొంగతనానికి పాల్పడ్డాడు విజయకాంత్​. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా అతడిని పోలీసులు గుర్తించారు.
మధురై జిల్లాలో మెల్లుర్​లోని ఓ ప్రైవేటు కళాశాలలో​ ఆదివారం పోలీసు ట్రైనీ పోస్టులకు పరీక్ష నిర్వహించారు. విజయకాంత్​ ఆ పరీక్షకు హాజరయ్యాడు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలకు చేరుకున్నారు. పరీక్ష రాసి బయటకు వచ్చిన విజయకాంత్​ను అరెస్టు చేశారు.

గొలుసు దొంగ చిత్రం

ఇదీ చూడండి:- జైట్లీ అంత్యక్రియల్లో మంత్రి ఫోన్ దొంగతనం

Last Updated : Sep 28, 2019, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details