గుజరాత్లో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ నిందితుడి ఉదంతం బయటపడింది. చిన్నారులకు తమ ఉపాధ్యాయురాలు పాఠాన్ని చెప్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వడోదరా జిల్లాలోని మర్కపురలో జరిగిందీ ఘటన.
పాఠం వింటూనే..
తమ ఉపాధ్యాయురాలు.. మంచి స్పర్శ, చెడు స్పర్శ(గుడ్ టచ్, బ్యాడ్ టచ్) అనే పాఠం గురించి చెప్తున్నప్పుడు తమపై అత్యాచారం జరిగిందన్న విషయాన్ని గ్రహించారు ఆ చిన్నారులు. బాధితుల్లోని ఓ బాలిక పాఠం వింటూ ఏడ్వటం మెదలుపెట్టింది. తర్వాత తమకు జరిగిన అనుభవాన్ని ఆ ఉపాధ్యాయురాలికి చెప్పారు మిగతా బాలికలు. సదరు టీచర్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.