ఉత్తర్ప్రదేశ్ లఖీంపుర్ ఖేరీలో ముడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి ఆపై ఘోరంగా హత్య చేసిన కేసును పోలీసులు చేధించారు. పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గంటల వ్యవధిలోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో స్వల్ప కాల్పులు చోటుచేసుకోగా నిందితుడు లేఖ్రామ్ కాలిలో బుల్లెట్ దిగింది. దీంతో సమీప ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
నిందితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదమేమీ లేదని వైద్యులు వెల్లడించారు. అవసరమైతే అతనిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేస్తామని ఉత్తర్ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు.