తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా పేరు మధ్యప్రదేశ్​.. నా కొడుకు పేరు భోపాల్​'

మధ్యప్రదేశ్​కు చెందిన 'మధ్యప్రదేశ్​ సింగ్​' అనే వ్యక్తి తన గారాల కొడుకుకు 'భోపాల్'​ అని నామకరణం చేశాడు. మీరు సరిగ్గానే చదివారు. ఆధార్​ కార్డ్​ ఆధారాల సాక్షిగా రాష్ట్రం పేరుతో ప్రసిద్ధికెక్కిన అతను.. ఇప్పుడు తన కుమారుడికి రాజధాని 'భోపాల్​' పేరు పెట్టుకున్నాడు.

'నా పేరు మధ్యప్రదేశ్​.. నా కొడుకు పేరు భోపాల్​'

By

Published : Nov 1, 2019, 7:02 AM IST

Updated : Nov 1, 2019, 7:22 AM IST

'నా పేరు మధ్యప్రదేశ్​.. నా కొడుకు పేరు భోపాల్​'

మధ్యప్రదేశ్​లోని ధార్​ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. తన పేరుతోనే అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు అలాంటి పేరే తన తనయుడికీ పెట్టి అందరినీ అశ్చర్య పరుస్తున్నాడు. ఆయన పేరే మధ్యప్రదేశ్​ సింగ్ ఆమ్లావర్​. తన కొడుకుకు భోపాల్​ అని నామకరణం చేశాడు.

ఝబూలోని శాహీద్ చంద్ర శేఖర్​ ఆజాద్​ కాలేజీలో భూగోళ శాస్త్రం ప్రొఫెసర్​గా పనిచేస్తున్న తనకు ఇంతటి గొప్ప పేరు తన తండ్రివల్లే వచ్చిందంటున్నాడు.

"నా పేరు వెనుక కారణం ఏమిటంటే.. మాది పెద్ద కుటుంబం. మా తొమ్మిది మంది సోదర సోదరీమణుల్లో నేను చిన్నవాడిని. అందుకే మా నాన్న ఏదైన ప్రత్యేక పేరు పెట్టాలనుకున్నాడు. మధ్యప్రదేశ్​ అనేది ఎంతో గొప్ప రాజ్యం.. ఆ పేరే ఎందుకు పెట్టొద్దు అనుకున్నాడు. ఆ తర్వాత అదే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు."

-మధ్యప్రదేశ్ సింగ్​

మొదట్లో ఇబ్బందిపడ్డా... తర్వాత తన పేరు గొప్పతనం తెలుసుకుని, మాతృభూమి పట్ల గౌరవాన్ని పెంచుకున్నానని ఈటీవీ భారత్​తో తన అనుభవాలు పంచుకున్నాడు మధ్యప్రదేశ్ సింగ్​​.

"మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది. నా పేరు అందరూ నవ్వుకునేలా ఉందని అనిపించేది. కానీ, 8,9 తరగతులకు వచ్చేసరికి నా పేరు గొప్పతనం నాకు తెలిసింది. నా పేరు ఎవరు విన్నా నమ్మకపోయేవారు, ఇది రాష్ట్రం పేరు కదా అనేవారు. గుర్తింపు కార్డు చూపిస్తే అప్పుడు నవ్వుకునేవారు. మీ తల్లిదండ్రులు మంచి పేరు పెట్టారని చెప్పేవారు."

-మధ్యప్రదేశ్ సింగ్​

ఆయనకు మాతృభూమి పట్ల ఉన్న ప్రేమను తన కుమారుడుకీ కాస్త పంచాడు. భోపాల్​ అని పేరు పెట్టుకున్నాడు. రాష్ట్రం పేరు పెట్టుకన్న తాను చిన్నప్పటి నుంచే తనకు కొడుకు పుడితే రాజధాని పేరు పెట్టాలనుకున్నట్లు తెలిపాడు.

కేవలం అతడి పేరు కారణంగా ఎందరో ప్రముఖులు మధ్యప్రదేశ్​ను కలిసేందుకు వస్తుంటారు. అంతెందుకు తన భార్య కిరణ్​ కాలేజీలో చదువుతున్న రోజుల్లో.. మధ్యప్రదేశ్​ అనే పేరు ఆకట్టుకోవడం వల్లే తనకు దగ్గరైంది మరి.

"మేము ఒకే కాలేజీలో చదువుకున్నాం.. మొదటిసారి తరగతి గదిలో మా మాస్టారు ఎం.పీ అని పిలిచారు. మోహన్​ ప్రసాద్​ వంటి పేరేదైనా అయి ఉంటుందేమో అనుకున్నా. కానీ, మా మాస్టారు మధ్యప్రదేశ్​ అని చెప్పారు. అప్పుడు నవ్వుకున్నాను. ఇంత విచిత్రమైన పేరు పెట్టారేంటబ్బా అనుకున్నాను."

- కిరణ్​

ఈ విచిత్ర పేరు తనకు గుర్తింపు తెచ్చినా.. కొన్ని సార్లు మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనక తప్పలేదు ప్రదేశ్​. ఓ రోజు, తను తన డ్రైవింగ్​ లైసెన్స్​ తీసువెళ్లటం మర్చిపోయాడు. ఆ సమయంలో వాహనం ఆపిన పోలీసులు.. పేరేంటని అడిగారు. ఎంతో వినయంగా మధ్యప్రదేశ్​ అని బదులిచ్చాడు సింగ్​ , కానీ 'పోలీసులతో పరాచాకాలు ఆడుతావా?' అని మధ్యప్రదేశ్​పై విరుచుకుపడ్డాడు ఆ అధికారి. ఆధార్ కార్డు చూపించే వరకు కోపంతో ఊగిపోయాడు. ఆధారాలు చూశాక, నవ్వుకుని సారీ చెప్పి పంపాడు.

మధ్యప్రదేశ్​ పేరు విని కొందరు వెకిలి నవ్వులు నవ్వుకుంటారు, మరికొందరు గొప్ప పేరు పెట్టుకున్నారని కితాబులిస్తారు. ఏదైతేనేం.. తాను పొందిన క్రేజీ అనుభూతులన్నింటినీ.. 'భోపాల్​ సన్​ ఆఫ్​ మధ్యప్రదేశ్'​గా తనయుడికీ అందించాడు సింగ్​.

Last Updated : Nov 1, 2019, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details