తమిళనాడు వెళ్లూర్లో లగ్జరీ కారు మోజులో.. పెళ్లి వయసు రాకుండానే తనయుడికి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశాడో తండ్రి. ఇప్పటికే ఓసారి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న శ్రీమంతురాలైన ఓ మహిళ(25).. తనను పెళ్లి చేసుకుంటే.. ఖరీదైన కారు కట్నంగా ఇస్తానని చెప్పింది. ఇంకేముంది.. ఆ తండ్రికి కారుపై మనసైంది. తన కుమారుడి వయసు 18 ఏళ్లే అయినా మగాడే కదా అనుకున్నాడు. 21 ఏళ్లు నిండకుండా పురుషుడికి వివాహం చేయకూడదని తెలిసినా.. ఏదోటి చేసి ఆ డబ్బున్న మహిళతో, తనయుడికి పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నాడు. వారం రోజుల్లో కల్యాణం జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు.
తండ్రి అత్యాశ.. కారుకోసం కొడుక్కి పెళ్లి ఏర్పాట్లు! - vellore news updates
ఖరీదైన కారుకు ఆశపడి.. తనయుడి జీవితాన్ని తాకట్టు పెట్టేందుకు సిద్ధపడ్డాడో తండ్రి. పెళ్లి ఈడుకు రాని కుమారుడిని.. విడాకులు తీసుకున్న 25 ఏళ్ల మహిళకిచ్చి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసేశాడు. అయితే, అంతలోనే తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగి పెళ్లి ఆపేశారు.
తండ్రి అత్యాశ.. కారుకోసం కొడుక్కి పెళ్లి ఏర్పాట్లు!
ఆ అత్యాశ తండ్రి గురించి ఓ బంధువెవరో పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంకేముంది, పెళ్లి వయసు రాకుండా కుమారుడికి పెళ్లి ఎలా చేస్తారని ప్రశ్నించి పెళ్లి ఆపేశారు. తనయుడికి 21 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయకూడదని వాంగ్మూలం తీసుకున్నారు.
ఇదీ చదవండి:ఒక టీచర్.. 25 పాఠశాలలు.. రూ.కోటి వేతనం